వచ్చే నెలలో మరో మెగా ఐపీఓ
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు సెబి ఆమోదం తెలిపింది. మార్కెట్ నుంచి రూ.25,000 కోట్ల వరకు నిధుల సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఐపీవో కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను హ్యుందాయ్ దాఖలు చేసింది. దేశ చరిత్రలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ అతి పెద్దది కాగా, తరవాతి స్థానంలో హ్యుందాయ్ నిలవనుంది. కంపెనీ మార్కెట్ విలువ 270 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంత వాటాను పబ్లిక్‌కు అమ్మనున్నారు. కొత్త షేర్ల జారీ ఉండదు.