For Money

Business News

కొనసాగుతున్న ర్యాలీ

ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత తరవాత ప్రారంభమైన ర్యాలీ వాల్‌స్ట్రీట్‌లో కొనసాగుతోంది. మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ స్వల్పంగా లాభపడగా, నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.33 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇంటెల్‌, టెస్లా ఇవాళ టెక్‌ షేర్ల లాభాల్లో ముందున్నాయి. వచ్చే గురువారం ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగం ఉంది. మరికొందరు ఫెడ్‌ అధికారులు కూడా మాట్లాడనున్నాయి. వీటి ప్రసంగాల తరవాత ఫెడ్‌ నవంబర్‌ సమావేశంపై మరింత క్లారిటీ వస్తుందని మార్కెట్‌ భావిస్తోంది. గత కొన్ని రోజులుగా వీక్‌గా ఉన్న డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ స్థిరంగా ఉంది. దీంతో బులియన్‌ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. 75 డాలర్ల వద్ద బ్రెంట్‌ క్రూడ్‌లో ఒత్తిడి కన్పిస్తోంది.