For Money

Business News

వోడాఫోన్‌ రూ. 30,500 కోట్ల డీల్‌

గతవారం సుప్రీం కోర్టు తరవాత వోడాఫోన్‌ ఐడియా పని అయిపోయిందన్నారు. ఆరోజు షేర్‌ 20శాతంపైగా క్షీణించింది. తరవాత కూడా నష్టాలు తప్పలేదు. కాని వోడాఫోన్‌ తన ప్రణాళికలను అమలు చేస్తూనే ఉంది. రానున్న మూడేళ్ళలో రూ. 55,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఇది వరకే కంపెనీ ప్రకటించింది. ఆ ప్రణాళికలో భాగంగా ఇవాళ నోకియా, ఎరిక్సన్‌, శామ్‌సంగ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ మన కరెన్సీలో రూ. 30,500 కోట్లపైనే. దేశ వ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తున్న వోడాఫోన్‌ ఈ మూడు కంపెనీలతో కలిసి నెట్‌వర్క్‌ను పూర్తి చేయనుంది. నెట్‌వర్క్‌ విస్తరణకు అసవరమైన ఎక్విమెంట్‌ సరఫరా కోసం ఈ మూడు కంపెనీలతో వోడాఫోన్‌ ఒప్పందం చేసుకుంది.

Leave a Reply