For Money

Business News

ఐపీఓకు హెచ్‌డీబీ ఫైనాన్స్‌ రెడీ

మరో పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) పబ్లిక్‌ ఇష్యూకు రెడీ అవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఐపీఓకు తొలి అడుగు పడింది. కంపెనీ ఐపీఓ ప్రతిపాదనకు మాతృసంస్థ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐపీఓ కింద రూ. 2,500 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. దీనితో పాటు ఇపుడు సంస్థలో ఉన్న ఇన్వెస్టర్లు కూడా తమ వద్ద ఉన్న ఈక్విటీలో కొంత భాగాన్ని అమ్ముతారు. ఈ ఇష్యూకు బ్యాంక్‌ ఆమోదం తెలపడంతో ఇక సెబీ వద్ద దరఖాస్తు చేయడమే తరువాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీబీ ఫైనాన్స్‌ వద్ద రూ. 66,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఏటా 17 శాతం చొప్పున రుణాల మొత్తం పెరుగుతోంది. ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 1,740 కోట్లు. మంచి లాభదాయకమైన ఈ కంపెనీ షేర్లను ఏ ధరకు ఆఫర్‌ చేస్తారో మరి.

Leave a Reply