For Money

Business News

ఇవాళ మార్కెట్‌లో ఫెడ్‌ ర్యాలీ

ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం తాలూకు ప్రభావం ఇవాళ మార్కెట్‌లో కన్పించింది. వాస్తవానికి నిన్న రావాల్సిన ర్యాలీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా ఒక రోజు వాయిదా పడిందన్నమాట. ఇవాళ దాదాపు అన్ని రంగాల షేర్ల సూచీలు పరుగులు తీశాయి. వోడాఫోన్‌ దెబ్బకు మొత్తం ఆదిత్య బిర్లా గ్రూప్‌ షేర్లపై నెగిటివ్‌ ప్రభావం కన్పిస్తోంది. ఇంత పెద్ద ర్యాలీలో కూడా ఈ గ్రూప్‌ షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి. గ్రాసిం, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. అలాగే ఇవాళ వచ్చిన ర్యాలీ పూర్తిగా సంప్రదాయ షేర్లదే. న్యూఏజ్‌ షేర్లలో కేవలం కొన్ని షేర్లు మాత్రమే ఇవాళ్టి ర్యాలీలో పాల్గొన్నాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే… నిఫ్టి చాలా నిస్తేజంగా ప్రారంభమైంది. కాని మిడ్‌ సెషన్‌ కల్లా కోలుకుని పటిష్ఠ స్థాయికి చేరింది. మిడ్‌సెషన్‌లో ఒక్కసారి నిఫ్టి కుప్పకూలింది. దాదాపు నాలుగు వందల పాయింట్ల వరకు క్షీణించిన నిఫ్టి..మిడ్‌ సెషన్‌కల్లా కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 375 పాయింట్ల లాభంతో 25,790 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, కోల్‌ ఇండియా ఉన్నాయి. ఇక నిఫ్టి లూజర్స్‌ గ్రాసిం, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌ ఉన్నాయి.

Leave a Reply