దుమ్ము రేపుతున్న ఐటీ షేర్లు
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు మార్కెట్ అంచనాలకు మించడంతో వాల్‌స్ట్రీట్ లాభాలతో పరుగులు పెడుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారీ నష్టాలు పొందిన టెక్, ఐటీ షేర్ల సూచీ నాస్‌డాక్ ఏకంగా 2.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.67 శాతం లాభంతో ఉంది. ఇక ఎకానమీ షేర్లను ప్రతిబింబించే డౌజోన్స్ సూచీ ఒక శాతం లాభంతో ఉంది. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా లాభపడగా, బాండ్ ఈల్డ్స్ కూడా స్వల్పంగా లాభపడ్డాయి. ఇక క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 75 డాలర్లను దాటగా, బులియన్‌లో వెండి దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది.