For Money

Business News

F&O: రూ.3,000 కోట్లు పోయాయి

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎంత డేంజర్‌ గేమో ఇవాళ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటు ఫ్యూచర్స్‌లోనూ, ఆప్షన్స్‌లోనూ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ముఖ్యంగా ఇవాళ ఈ కౌంటర్‌లో స్టాప్‌లాస్‌ చాలా మందికి షాక్‌ ఇచ్చింది. ఎఫ్‌ అండ్‌ ఓలో వొడాఫోన్‌ ఐడియా ఇన్వెస్టర్లు ఇవాళ భారీగా నష్టపోయారు. ఇవాళ డెరివేటివ్స్‌ వీక్లీ క్లోజింగ్‌.ఈ నెల డెరివేటివ్స్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 98 శాతం క్షీణించింది. అక్టోబర్‌ నెల ఈ షేర్‌ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 300 శాతం పెరిగింది. అయితే రెండు ఓపెన్‌ ఇంటరెస్ట్‌లను విలువ పరంగా చూస్తే… ఇవాళ చాలా మంది ఇన్వెస్టర్లు తమ కాంట్రాక్ట్‌లను వొదిలేసినట్లు తెలుస్తోంది.లేదా షేర్‌ 20 శాతం క్షీణించేసరికి.. స్టాప్‌లాస్‌లు ట్రిగ్గర్‌ కావడంతో చాలా వరకు ఫ్యూచర్స్‌ పొజిషన్స్‌ స్క్వేర్‌ ఆఫ్‌ అయినట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నారు. సుప్రీంకోర్టు కారణంగా ఇవాళ వొడాఫోన్‌ షేర్‌ ఏకంగా 20 శాతం క్షీణించింది. దీంతో ఫ్యూచర్స్‌ విభాగంలోనే ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 3000 కోట్ల దాకా నష్టపోయి ఉంటారని అంచనా. ఇక ఈ షేర్‌ ఆప్షన్స్‌లో కాల్‌ రైటింగ్‌ చేసినవారి పంట పండితే… పుట్‌ రైటింగ్‌ చేసినవారు అడ్డంగా బుక్‌ అయిపోయారు. నిన్న 15 పైసలు ఉన్న రూ.12ల పుట్‌ ఇవాళ రూ.1.7 (1000 శాతం)కాగా, అయిదు పైసల కనిష్ఠ స్థాయి తాకిన రూ.11 పుట్ కూడా రూపాయికి (1900 శాతం)చేరింది.