For Money

Business News

రూ. 9 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్‌

ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం మరికొన్ని గంటల్లో వెలువడుతున్న నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్‌లో బ్యాంకు షేర్లు బాగా రాణించాయి. బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా ఒక శాతంపైగా పెరిగింది. ఫైనాన్షియల్‌ నిఫ్టి ఒకటిన్నర శాతం దాకా లాభపడింది. ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులన్నీ ఇవాళ లాభాల బాట పట్టాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇవాళ ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని తాకింది.ఒకటిన్నర శాతం దాకా లాభపడిన ఈ షేర్‌ రూ. 1295ను తాకింది. తరవాత క్లోజింగ్‌లో రూ. 1285 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా రూ. 9 లక్షల కోట్లు దాటింది. ఈ షేర్‌ గత ఏడాది అక్టోబర్‌ 26వ తేదీ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 899ని తాకింది. అక్కడి నుంచి దాదాపు రూ. 400లు పెరిగిందన్నమాట. అంటే రిటర్న్‌ 40 శాతంపైనే ఇచ్చింది. ఈ ఏడాదిలోనే కంపెనీ షేర్‌ 28 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చింది. తాజా మార్కెట్‌ క్యాప్‌తో టాప్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నాలుగో స్థానంలో నిలిచింది. రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తొలి మూడు స్థానాలు పొందాయి. నాలుగో స్థానాన్ని ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ కలిసి పంచుకున్నాయి.

Leave a Reply