For Money

Business News

గోల్డ్‌ @ 75000

ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రెండోసారి వడ్డీ రేట్లు తగ్గించగా… అమెరికాలో రేపు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఇవాళ, రేపు భేటీ కానుంది. వడ్డీ రేట్లను పావు శాత లేదా అర శాతం మేర వడ్డీ రేట్లను ఫెడరల్‌ బ్యాంక్‌ తగ్గించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బులియన్‌ మార్కెట్‌లో సందడి మొదలైంది. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. అమెరికాలో ఔన్స్‌ బంగారం ధర రెండు వేల ఆరు వందల డాలర్లు దాటింది. డాలర్‌ బాగా క్షీణించడం కూడా బులియన్‌ మార్కెట్‌కు కలిసి వస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో… బంగారం దిగుమతుల బాగా పెరిగాయి. కేవలం ఆగస్టు నెలలోనే 83 వేల 500 వందల కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమతి అయింది. పండుగల సీజన్‌ కూడా కావడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర 75 వేల రూపాయలను దాటింది. పది గ్రాముల ఆర్నమెంట్‌ గోల్డ్‌ దర కూడా 68వేల రూపాయలకుపైనే ఉంటోంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను అర శాతం తగ్గిస్తే… బులియన్ మార్కెట్‌లో జోష్‌ మరింత పెరిగే అవకాశముంది. స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరలు అల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో ఉన్నందున.. ఇన్వెస్టర్లు కూడా బంగారంపై దృష్టి సారిస్తున్నారు.

Leave a Reply