For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు రీటైల్‌ సేల్స్‌ బూస్ట్‌

ఆగస్టు నెలలో అమెరికాలో రీటైల్‌ సేల్స్‌ 0.1 శాతం పెరిగింది. ఈ నెలలో రీటైల్‌ సేల్స్‌ కనీసం 0.2 శాతం తగ్గుతుందని అనలిస్టులు అంచనా వేశారు. అంచనాలకు భిన్నంగా సానుకూల డేటా రావడంతో వాల్‌స్ట్రీట్‌ లాభాల్లోకి ట్రేడవుతోంది. మూడు ప్రధాన సూచీలు అరశాతంపైగా లాభంతో ఉన్నాయి. అత్యధికంగా నాస్‌డాక్‌ 0.74 శాతం లాభంతో ట్రేడవుతోంది. యాపిల్‌ షేర్లు దాదాపు నిన్నటి స్థాయిలోనే ట్రేడవుతుండగా, ఇంటెల్‌ కార్పొరేషన్‌ షేర్‌ 4.5 శాతం, టెస్లా 2.5 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ 0.5 శాతం మేర వడ్డీ తగ్గిస్తుందని మెజారిటీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మరోవైపు ఫెడ్‌ సమావేశం ఇవాళ ప్రారంభమైంది. రేపు సమావేశం తరవాత ఫెడ్‌ నిర్ణయాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా 100.5 ప్రాంతంలోనే ఉంది. బులియన్‌ కూడా అంతే. క్రితం స్థాయిల వద్దే ఉంది. ఔన్స్‌ బంగారం ధర 2600 డాలర్ల ప్రాంతలో ట్రేడవుతోంది. మరోవైపు క్రూడ్‌ ధరలు మాత్రం ఇవాళ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 73.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.