For Money

Business News

ఓలాలో సడన్‌ జంప్‌ దేనికి?

ఓల ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ షేర్‌ ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమై ఏకంగా 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ వద్ద ముగిసింది. లిస్టింగ్‌ తరవాత ఒక్కసారిగా రూ. 157.10కి చేరిన ఓలా కంపెనీ షేర్‌ నిన్న రూ. 107.60 వద్ద ముగిసింది. ఈ షేర్‌ రూ. 76 నుంచి రూ. 157కు చేరడానికి కారణంగా ఈ షేర్‌ను హెచ్‌ఎస్‌బీసీ రెకమెండ్‌ చేయడం. ఈ షేర్‌ రూ. 100 ప్రాంతంలో ఉండగా.. రూ. 140 టార్గెట్‌ను ఇచ్చింది హెచ్‌ఎస్‌బీసీ. దీంతో షేర్‌ రూ. 157కి చేరింది. తరవాత తగ్గుముఖం పట్టి రూ. 107కి చేరింది. ఇవాళ ఉదయం ఎన్‌ఎస్‌ఈలో రూ. 112.95 వద్ద ప్రారంభమైన షేర్‌ తరవాత రూ. 110.26కి క్షీణించింది. అయితే మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు లాభాలతో కదలాడిన ఈ షేర్‌ ఆ తరవాత రూ. 118.36 అంటే 20 శాతం సీలింగ్‌ వద్ద ముగిసింది.దీనికి ప్రధాన కారణంగా…ఈ షేర్‌ను కొనాల్సిందిగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ రికమెండ్‌ చేశాయి. గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ ఈ షేర్‌ టార్గెట్‌ను రూ.160గా పేర్కొంది. అంటే మరో 35 శాతం లాభానికి ఆస్కారం ఉందన్నమాట. ఇక బ్యంక్‌ ఆఫ్‌ అమెరికా ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 145గా పేర్కొంది. ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ మార్కెట్‌లో ప్రధాన వాటాను ఓలా చేజిక్కించుకుంటుందని గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ అభిప్రాయపడింది. అలాగే బ్యాటరీ టెక్నాలజీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నా… పెట్టుబడికి యోగ్యమైన షేర్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొంది.

Leave a Reply