For Money

Business News

మరో ‘హెచ్‌డీఎఫ్‌సీ’

లిస్టింగ్‌ రోజు అదరగొట్టిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రెండోరోజూ అప్పర్‌ సీలింగ్‌ వద్ద ముగిసింది. కంపెనీ రూ. 70లకు షేర్‌ను ఆఫర్‌ చేస్తే… ఇవాళ రూ.181.48 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,49,823.36 కోట్లకు చేరింది. గృహ రుణాల మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే బజాజ్‌ హౌసింగ్‌ కరెక్ట్‌ సమయలో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తరవాత ఏర్పడిన… ఖాళీని బజాజ్‌ హౌసింగ్‌ పూర్తి చేస్తుందన్న టాక్‌ ఇపుడు మార్కెట్‌లో బలంగా ఉంది. కంపెనీ గృహాలకు ఇచ్చిన రుణాల మొత్తం దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరువుగా ఉంది. పైగా ఎన్‌పీఏల శాతం చాలా తక్కువ. బ్యాంకింగ్‌ రంగంలో కూడా పరిస్థితులు మారుతున్నాయి. ఇన్నాళ్ళు… హౌసింగ్‌, రీటైల్‌ రుణాలపై దృష్టి సారించిన బ్యాంకులు ఇపుడు కార్పొరేట్‌ రుణాల మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించాయి. ఇటువంటి సమయంలో మార్కెట్‌ నుంచి భారీ మొత్తాన్ని సమీకరించిన బజాజ్‌ హౌసింగ్‌ మున్ముందు బ్యాంకులకు గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో కొత్త తరహా వాతావరణాన్ని ఈ కంపెనీ సృష్టించనుంది. ప్రతి ఇన్వెస్టర్‌ ఖాతాలో ఉండదగని షేర్లలో బజాజ్‌ హౌసింగ్‌ కూడా ఒకటని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ షేర్‌కు సెకండరీ మార్కెట్‌లో కూడా భారీ డిమాండ్‌ లభిస్తోంది.

Leave a Reply