For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు జాగ్రత్త ఉంటున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం ఆరు పాయింట్ల నష్టంతో 25377 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి స్వల్ప లాభంతో ఉంది. ఇతర షేర్లలో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. ఇవాళ ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. ఆటో షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. బజాజ్‌ ట్విన్స్‌ కూడా డల్‌గా ఉన్నాయి. బజాజ్‌ హౌసింగ్‌ షేర్‌లో ఇవాళ కూడా హడావుడి కన్పిస్తోంది. షేర్‌ 10 శాతం అప్పర్‌ సీలింగ్‌ రూ. 181ని తాకి ఇపుడు రూ. 176 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply