నిఫ్టిపై మిడ్ క్యాప్ ఎఫెక్ట్
ఇవాళ మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఆసియాలో మెజారిటీ మార్కెట్లకు ఇవాళ సెలవు కావడంతో మార్కెట్ మూడ్ డల్‌గా ఉంది. కేవలం బజాజ్ హౌసింగ్ లిస్టింగ్ హడావుడి తప్ప మరోటి లేదు. ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌కు క్లియరెన్స్ వస్తుందనే ఆశలతో బీఎస్‌ఈ, ఎంసీఎక్స్ షేర్లు ఇవాళ ఏడు శాతం దాకా లాభపడ్డాయి. ఇవాళ్టి స్టార్ షేర్ బజాజ్ హౌసింగ్. ఈ షేర్‌ను కంపెనీ రూ. 70లకు ఆఫర్ చేయగా ఇవాళ రూ. 150 వద్ద లిస్టయింది. వెంటనే అమ్మకాలు రావడంతో రూ. 146కి పడినా… తరవాత వరదలా వచ్చిన కొనుగోళ్ళ ఆర్డర్లతో ఈ షేర్ మిడ్ సెషన్‌లోనే అప్పర్ సర్క్యూట్ (రూ. 165)ను తాకింది. ఈ ధర వద్ద కూడా ఎన్‌ఎస్‌ఈలో 40 లక్షల షేర్లకు కొనుగోళ్ళ ఆర్డర్లు ఉన్నాయి. ఈ కంపెనీ కౌంటర్‌లో ఇవాళ 63.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1.37 లక్షల కోట్లకు చేరింది. ఇక నిఫ్టి విషయానికొస్తే మిడ్ క్యాప్ షేర్లు దెబ్బతీశారు. ఉదయం ఒక మోస్తరుగా లాభాలు పొందినా.. తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్ క్యాప్ షేర్ల సూచీ 0.57 వాతం నష్టపోయింది. నిఫ్టి మాత్రం 25,445ను తాకినా… మిడ్ సెషన్‌లో మొత్తం లాభాలు పోయి నష్టాల్లోకి చేరింది. అక్కడి నుంచి కోలుకుని చివరల్లో 27 పాయింట్ల లాభంతో రూ. 25383 వద్ద ముగిసింది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు టాప్‌లో నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ లీవర్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్‌బీఐ లైఫ్, బ్రిటానియా ముందున్నాయి.