For Money

Business News

జొమాటొకు స్విగ్గీ జోష్‌?

ఫుడ్‌ డెలివరీ రంగంలో ఉన్న జొమాటోకు ఇపుడు స్విగ్గీ తోడుకానుంది. ఈ రంగంలో ఇప్పటి వరకు జొమాటొకు దాదాపు పోటీనే లేదు. ఇపుడు స్విగ్గీ రావడంతో బయట మార్కెట్‌తో పాటు స్టాక్‌ మార్కెట్‌లో కూడా వీటి మధ్య పోటీ బాగా పెరిగే అవకాశముంది. గాడిలో పడిన జొమాటో షేర్‌ ఇపుడు స్విగ్గీ పుణ్యమా అని రీరేటింగ్‌కు ఛాన్స్‌ కూడా ఉంది. మార్కెట్‌ నుంచి సుమారు బిలియన్‌ డాలర్లు అంటే రూ. 8400 కోట్లు సమీకరించేందుకు స్విగ్గీ రెడీ అవుతోంది. ఇపుడు క్యాపిటల్‌ మార్కెట్‌లో సెకండరీతోపాటు ప్రైమరీ మార్కెట్‌లో కూడా మంచి జోష్‌ కన్పిస్తోంది. ఈ పరిస్థితులను క్యాష్‌ చేసుకోవాలని అనేక కంపెనీలు తొందర పడుతున్నాయి. స్విగ్గీ కూడా ఈ వారంలోనే ఐపీఓకు దరఖాస్తు చేయనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా రెస్టారెంట్లతో టై అప్‌ ఉంది. జొమాటోకు గట్టి ప్రత్యర్థిగా ఉన్న స్విగ్గీ సెకండరీ మార్కెట్‌లోకి వస్తే… తమ షేర్లకు కూడా మంచి వ్యాల్యూయేషన్‌ వస్తుందని జొమాటొ భావిస్తోంది. పైగా తాము త్వరలోనే లాభాల్లోకి వస్తామని… ఏ విధంగా చూసినా ఫుడ్‌ డెలివరీ రంగంలో తాము నంబర్‌ వన్‌గా నిలుస్తామని జొమాటొ అంటోంది.

Leave a Reply