For Money

Business News

లిస్టింగ్‌ రోజూ 120 శాతం లాభం?

భారత ప్రైమరీ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన బజాజ్‌ హౌసింగ్‌ పైనాన్స్‌ కంపెనీ షేరు రేపు అంటే సోమవారం లిస్ట్‌ కానుంది. ఈ కంపెనీ రూ. 67-70 ధరల శ్రేణితో షేర్లను ఆఫర్‌ చేసింది. ఇన్వెస్టర్ల నుంచి రూ. 6,560 కోట్ల సమీకరణకు కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ చేయగా రూ. 3.24 లక్షల కోట్ల విలువైన షేర్లకు బిడ్‌లు వచ్చాయి. దాదాపు 64 రెట్ల వరకు ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ ఇష్యూ ఆఫర్‌ గరిష్ఠ ధర రూ. 70 కాగా, ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ప్రకారం గ్రే మార్కెట్‌లో అంటే అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌ రూ. 154 పలుకుతోంది. అంటే లిస్టింగ్‌ రోజే ఇన్వెస్టర్లకు రూ.84 లాభం వస్తుందన్నమాట. పెట్టుబడిపై 120 శాతం లాభం గిట్టుబాటు కానుంది. ఈ స్థాయికి మించి గనుక ఈ షేర్‌ లాభాలు గడిస్తే… లిస్టింగ్‌ రోజే ట్రేడర్లు లాభాలను బుక్‌ చేసుకోవచ్చని కొందరు బ్రోకర్లు సూచిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం ఈ షేర్‌ అట్టిపెట్టుకోవడమే లాభదాయకమని అంటున్నారు.