For Money

Business News

మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గింపు

గడచిన మూడు నెలల్లో యూరోపియన్ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఇవాళ మానటరీ పాలసీని సమీక్షించిన ఈసీబీ డిపాజిట్‌ ఫెసిలిటీ రేటును పావు శాతం తగ్గించి 3.5 శాతం చేసింది. జూన్‌లో 4 శాతం ఉన్న ఈ రేటును 0.25 శాతం తగ్గించి 3.75 శాతం చేసింది. జులైలో వడ్డీ రేట్లలో మార్పులేదు. ఇవాళ 3.75 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ఈ నెలలోనే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనున్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply