For Money

Business News

మరో రూ. 2000 కోట్ల పబ్లిక్‌ ఆఫర్‌

ప్రస్తుతం మార్కెట్‌లో హాస్పిటాలిటీ రంగానికి చెందిన కంపెనీల షేర్ల సంఖ్య తక్కువే. ఈ రంగం నుంచి మరో ప్రముఖ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. అమెరికా చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌ మద్దతు ఉన్న వెంటివ్‌ హాస్పిటాలిటీ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. మార్కెట్ నుంచి రూ. 2000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓకు ముందే రూ. 400 కోట్లను ప్లేస్‌మెంట్ ద్వారా సమీకరించాలని భావిస్తోంది. అంటే రూ. 1600 కోట్లకు పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందన్నమాట. హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా వచ్చే నిధులను అప్పులు తీర్చేందుకు వాడుతుంది. అయితే ఈ కంపెనీకి ఇపుడు ఉన్న రుణాల మొత్తం రూ.442 కోట్లు మాత్రమే. ఈ కంపెనీలో పంచశీల్‌ గ్రూప్‌నకు 60 శాతం వాటా ఉండగా, బ్లాక్‌స్టోన్‌కు 40 శాతం వాటా ఉంది. విశేషమేమిటంటే… వీరెవరూ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా తమ వాటాను అమ్మడం లేదు. మొత్తం సొమ్ము కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరించనున్నారు.

Leave a Reply