For Money

Business News

స్థిరంగా ప్రారంభం

స్టాక్‌ మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 25014 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 7 పాయింట్ల నష్టంతో 24929 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కూడా ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. పైగా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టిని బ్యాంక్‌ నిఫ్టి ప్రభావితం చేస్తోంది. దీంతో ఈ రెండు సూచీలు స్థిరంగా ఉండటంతో… మిడ్‌ క్యాప్‌ షేర్లు దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ఈ షేర్లు ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. కోఫోర్జ్‌ ఏకంగా 4 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఐడియా, జూబ్లియంట్ పుడ్‌, ఇండియన్‌ హోటల్‌, యూపీఎల్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. ఇక స్మాల్‌ క్యాప్‌లో హావెల్స్‌ టాప్‌లో ఉంది. ఇక నిఫ్టి విషయానికొస్తే దివీస్‌ ల్యాబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా కన్జూమర్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేసే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేయడంతో ఆ రంగానికి చెందిన షేర్లలో ఒత్తిడి వస్తోంది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఉన్నాయి. ఇక గత కొన్ని రోజులుగా జోరు మీద ఉన్న బజాజ్‌ ట్విన్స్‌లో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది.

Leave a Reply