For Money

Business News

రేపు ఈ షేర్లలో ఏం జరుగనుంది?

నిఫ్టి రేపు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో రేపు రెండు షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొదటిది ఒలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ. ఈ షేర్‌ లిస్ట్‌ అయి రేపటితో నెల పూర్తవుతుంది. అంటే ఈ కౌంటర్‌లో లాక్‌ ఇన్‌ పీరియడ్‌ రేపటితో పూర్తవుతుందన్నమాట. దీంతో ఏకంగా నాలుగు శాతం వాటా అంటే 18.18 కోట్ల షేర్లకు ఈ పీరియడ్‌ నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఈ షేర్లు పొందిన వ్యక్తులు లేదా కంపెనీలు ఈ షేర్లలో ట్రేడింగ్‌ ప్రారంభించుకోవచ్చు. అంటే వీటిని అమ్ముకోవచ్చు లేదా తమ వద్దే కొనసాగించుకోవచ్చు. మరి రేపు వీరు ఎవరైనా అమ్ముతారా? లేదా వెయిట్‌ చేస్తారా అన్నది చూడాలి.
ఇక రెండో షేర్‌ స్పైస్‌జెట్‌. ఈ కంపెనీ షేర్‌ కూడా రేపు యాక్టివ్‌గా ఉండొచ్చు. కార్లిలే ఏవియేషన్‌ కంపెనీకి స్పైస్‌జెట్‌ 13.76 కోట్ల డాలర్ల బకాయి ఉంది. బకాయిలు చెల్లించమని కార్లలే ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ఆర్థికంగా కంపెనీ చితికిపోవడంతో బకాయిలు చెల్లించలేకపోతోంది. దీంతో తనకు బకాయి ఉన్న మొత్తంలో 4 కోట్ల డాలర్ల విలువైన రుణాలను ఈక్విటీగా మార్చుకోవడానికి కార్లిలే అంగీకరించింది. దీంతో రుణ మొత్తం 9.75 కోట్ల డాలర్లకు తగ్గుతందన్నమాట. అలాగే కంపెనీలో పది నుంచి 15 శాతం వాటాను ప్రమోటర్‌ అజయ్‌ సింగ్ విక్రాయిస్తారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికే క్యూపీఐలతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ రాసింది. ఈ నెలాఖరులోగా రూ. 2000 కోట్లను సమీకరించాలని అజయ్‌ సింగ్‌ కృతనిశ్చయంతో ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. క్రూడ్‌ ధరలు భారీగా తగ్గిన సమయంలో ఏవియేషన్‌ షేర్లకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రేపు స్పైస్‌జెట్‌ ఎలా రియక్ట్‌ అవుతుందో చూడాలి.