For Money

Business News

చైనాలో అదానీ కంపెనీ

చైనాలో గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ఓ కంపెనీని నెలకొల్పింది. ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ చైనాలో వంద శాతం అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. చైనాలో సప్లయి చైన్‌ సర్వీసెస్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను అందించేందుకు ఈ కంపెనీని నెలకొల్పినట్లు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ వెల్లడించింది. ఈ కంపెనీ అదానీ ఎనర్జి రీసోర్సస్‌ షాంఘై పేరుతో పనిచేస్తుందని, షాంఘై కేంద్రంగా పనిచేస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజస్‌ పేర్కొంది. సింగపూర్‌లోని ఇప్పటికే ఉన్న అదానీ గ్లోబల్‌ పీటీఈకి అనుబంధ కంపెనీగా చైనా కంపెనీ పనిచేస్తుందని తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ మన దేశంలో మైనింగ్, రోడ్లు, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లతో పాటు వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రకర్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది.

Leave a Reply