రేపు నిఫ్టికి భారీ నష్టాలు?
శుక్రవారం నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. దాదాపు కనిష్ఠ స్థాయి వద్ద క్లోజైంది. అంటే దిగువ స్థాయిలో మద్దతు అందలేదన్నమాట. దీనికి కారణంగా అప్పటికీ అమెరికా ఫ్యూచర్స్ కూడా భారీ నష్టాల్లో ఉండటమే. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు తాజా పొజిషన్స్ తీసుకోవడానికి జంకారు. వారు ఊహించినట్లే శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లకు ప్రాంతినిధ్యం వహించే నాస్‌డాక్ సూచీ 2.55 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.73 శాతం నష్టపోయింది. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ సూచీ కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. గత శుక్రవారం మన ఐటీ షేర్లు చివర్లో నష్టాలతో ముగిశాయి. ట్రెండ్ చూస్తుంటే సోమవారం కూడా ఐటీ షేర్లలో అమ్మకాలు తప్పేలా లేవు. అలాగే బ్యాంకింగ్ షేర్లలో కూడా ఒత్తిడి కొనసాగే అవకాశముంది. శుక్రవారం బ్యాంక్ నిఫ్టి ఏకంగా 1.7 శాతంపైగా నష్టపోయింది. ఎన్‌బీఎప్‌సీ షేర్లలో కూడా ఒత్తిడి కన్పించింది. క్రూడ్ ధరలు భారీగా క్షీణించిన కారణంగా… సంబంధిత రంగాల షేర్లు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. పెయింట్ రంగం షేర్ల, టైర్లతో పాటు హెచ్‌యూఎల్ వంటి క్రూడ్ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు వినా ఇతర రంగాల్లో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఇన్వెస్టర్లు కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారు. క్రూడ్ ధరలు తగ్గడం ఓఎంసీ షేర్లకు సానుకూలమైనా… పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తారని వార్తల నేపథ్యంలో ఈ కౌంటర్లలో కూడా తాజా ఆసక్తి కన్పించడం లేదు. గిఫ్టి నిఫ్టి ట్రెండ్‌ను చూస్తుంటే నిఫ్టి సోమవారం 24500 స్థాయిని కాపడుకుంటుందా అన్నది చూడాలి.