ఈ షేర్ 14 శాతం పెరిగింది
ఈజీ మై ట్రిప్ షేర్ ఇవాళ అనూహ్యంగా 14 శాతం పెరిగింది. 2 గంటల వరకు ఈ కౌంటర్లో పెద్దగా యాక్టివిటీ లేదు. తాము ఎలక్ట్రానిక్ బస్ల తయారీ రంగంలో ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్ 14 శాతం పెరిగి రూ. 44.38ని తాకింది. షేర్ క్రితం ముగింపు రూ.38.89. అధిక స్థాయిలో షేర్ల సరఫరా పెరగడంతో పది శాతం లాభంతో రూ. 42.77 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ కంపెనీ టికెట్ బుకింగ్, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్, టూర్ ప్లానింగ్ రంగాల్లో విస్తరించి ఉంది. తయారీ రంగంలో ఈ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. పైగా తమ అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్ బస్సుల తయారీ చేపడుతుందని ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇవ్వడం మినహా… ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.