For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

నిన్న భారీ నష్టాలతో ముగిసిన వాల్‌స్ట్రీట్‌ ఇవాళ స్థిరంగా ట్రేడవుతోంది. అన్ని సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ కూడా దాదాపు క్రితం ముగింపు వద్దే. నిన్న పది శాతం దాకా నష్టపోయిన ఎన్‌విడియా షేర్‌ ఇవాళ గ్రీన్‌లో ఉంది. మరోవైపు యూరో మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. నిన్న ఒక మోస్తరు లాభాలు పొందిన డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ అర శాతం దాకా నష్టపోయింది. అమెరికాతో పాటు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయన్న అంచనాతో నిన్న నాలుగు శాతం దాకా నష్టపోయిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఇవాళ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో ట్రేడయ్యే WTI క్రూడ్‌ బ్యారెల్‌ ధర 70 డాలర్ల దిగువకు వచ్చింది. ఆసియా దేశాలు కొనే బ్రెంట్ క్రూడ్‌ ధర 73 డాలర్ల ప్రాంతంలో ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించేసరికి బులియన్‌ మార్కెట్‌ గ్రీన్‌లోకి వచ్చింది. అయినా ఔన్స్‌ స్టాండర్డ్‌ బంగారం ధర 2525 డాలర్ల వద్దే ట్రేడవుతోంది. వెండి ధరల్లో కూడా పెద్ద మార్పు లేదు.