For Money

Business News

కోలుకున్నా నష్టాల్లో….

ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 100 పాయింట్లకు పైగా కోలుకున్నా నిఫ్టి నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలతో ఉండటంతో…ఆ ట్రెండ్‌ ప్రభావం మన మార్కెట్లపై పడింది.అయితే ఫార్మా వంటి డిఫెన్స్‌ స్టాక్స్‌తో పాటు క్రూడ్‌ పతనం వల్ల ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. అలాగే క్రూడ్‌ ఆధార కంపెనీలైన ఏషియన్‌ పెయింట్స్‌, ఇండిగో పెయింట్స్ వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. రాత్రి నాస్‌డాక్‌ మూడు శాతంపైగా నష్టపోవడంతో ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అలాగే బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన ఒత్తిడి కూడా నిఫ్టిపై కన్పించింది. ఒకదశలో 25083 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 25216ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 81 పాయింట్ల నష్టంతో నిఫ్టి 25198 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫ్యూచర్స్‌తో పాటు, యూరో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం వల్ల నిఫ్టిపై చివరి దాకా ఒత్తిడి కొనసాగింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిం, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌, సన్‌ ఫార్మా ముందున్నాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో విప్రో టాప్‌లో ఉంది.