For Money

Business News

ఆప్షన్స్‌లో బాలకృష్ణ జోరు

1993 తరవాత వరుసుగా 13 సెషన్స్‌ పెరుగుతూ వచ్చిన నిఫ్టి ఇవాళ కూడా గ్రీన్‌లో ముగిసింది. నిన్న లేబర్‌ డే సందర్భంగా అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్‌ అరశాతంపైగా నష్టంలో ఉండటం, ఆసియా మార్కెట్లలో కూడా ట్రెండ్‌ బలహీనంగా ఉండటంతో ఇవాళ మన సూచీలు నిస్తేజంగా ఉన్నాయి. నిఫ్టి కేవలం ఒక పాయింటు లాభంతో ముగిసింది. దీంతో 14వ రోజు కూడా గ్రీన్‌లో క్లోజై కొత్త రికార్డు సృష్టించింది. నిఫ్టి ఇవాళ ఉదయం 25233 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకినా.. తరవాత కోలుకుని 25,321 గరిష్ఠ స్థాయిని తాకింది. చివర్లో వచ్చిన లాభాల స్వీకరణ కారణంగా ఒక పాయింటు లాభంతో నిఫ్టి 25279 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ ఉదయం 82,652 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నా 82,675 స్థాయిని తాకింది. కాని చివర్లో 4 పాయింట్ల నష్టంతో 82,555 వద్ద ముగిసింది. ఇటీవల లైఫ్‌ ఇన్సూరెన్స్ షేర్ల హవా కొనసాగుతోంది. ఇవాళ ఎస్‌బీఐ లైఫ్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ట్విన్స్‌లో లాభాలు ఇవాళ భిన్న ట్రెండ్‌ కన్పించింది. బజాజ్‌ హౌసింగ్‌ ఐపీఓ దృష్ట్యా బజాజ్ ఫిన్‌ సర్వ్‌లో లాభాలు కొనసాగగా… బజాజ్‌ ఫైనాన్స్‌ నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ కంపెనీలకు బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆప్షన్స్‌లో బాలకృష్ణ షేర్‌ కాల్‌ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. 3500 స్ట్రయిక్‌ ఆప్షన్స్‌ ఇవాళ 2,233 శాతం లాభంతో ముగిసింది. ఈ ఆప్షన్‌ క్రితం ముగింపు 25 పైసలు కాగా, ఈ ఇవాళ రూ. 4.4ను తాకి రూ. 3.5 వద్ద ముగిసింది. ఇవాళ ఈ కంపెనీ షేర్‌ ఒక శాతంపైగా లాభపడి రూ. 2,929 వద్ద ముగిసింది. ఒక ముత్తూట్‌ ఫైనాన్స్‌ 1660 పుట్‌ ఆప్షన్స్‌ 1525 శాతం లాభంతో రూ. 3.25 వద్ద ముగిసింది. ఈ ఆప్షన్‌ క్రితం ముగింపు 25 పైసలు.