For Money

Business News

మళ్ళీ అదానీనే

హిండెన్‌బర్గ్‌ రిపోర్టు కారణం ప్రపంచ కుబేరుల జాబితాలో అనేక స్థానాలు కోల్పోయిన గౌతమ్‌ అదానీ మళ్ళీ కోలుకుంటున్నారు. తాజాగా వెలువడిన భారత అపర కుబేరుల జాబితా హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో మళ్ళీ నంబర్‌ వన్‌గా నిలిచారు. ఇప్పటి వరకు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని దాటేశారు. భారత్‌లోమొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, వీరి సంఖ్య ఏడాదిలో 29 శాతం పెరిగిందని హురూన్‌ తెలిపింది. జులై 31 నాటి గణాంకాలను ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు హురూన్‌ వెల్లడించింది. నంబర్‌గా నిలిచిన గౌతమ్‌ అదానీ సంపద రూ.11.61 లక్షల కోట్లు కాగా, గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు హురూన్‌ తెలిపింది. ఇక రూ.10.14 లక్షల కోట్లతో ముకేశ్‌ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌నాడార్‌, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ నాలుగైదు స్థానాలు దక్కించుకున్నారు.