For Money

Business News

బోనస్‌ షేర్ల జారీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇవాళ్టి ఏజీఎం సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్‌ 5వ తేదీన సమావేశం కానుంది. గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2009, 2017లో ఇదే నిష్పత్తిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోనస్‌ షేర్లను జారీ చేసింది.ఇవాళ్టి ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్‌ ధర భారీగా పెరిగింది. ఇవాళ రూ.3,007 వద్ద ప్రారంభమైన ఈ షేర్‌ ఒక దశలో రూ.3,065ను తాకింది. అయితే చివర్లో 1.55 శాతం లాభంతో ఈ షేర్‌ రూ. 3042 వద్ద ఎన్‌ఎస్‌ఈలో ముగిసింది. ఇవాళ ఆగస్టు డెరివేటివ్స్‌ సిరీస్‌ ముగింపు కావడంతో చివర్లో షేర్‌లో ఒత్తిడి వచ్చింది.