NIFTY TRADE: పెరిగితే అమ్మండి….
విదేశీ ఇన్వెస్టర్లు షేర్ల బదులు నిఫ్టికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ నేపథ్యంలో నిఫ్టిపై బెట్టింగ్ పెరుగుతోంది. అందుకే నిఫ్టిలో రోజూ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. పూర్తి డే ట్రేడర్స్కు అనుకూలంగా నిఫ్టిలో ట్రేడింగ్ సాగుతోంది. భారీ హెచ్చతగ్గులకు ఉన్నా … క్లోజింగ్ కల్లా నిఫ్టి స్వల్ప లాభంతో ముగుస్తోంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టికి తొలి ప్రతిఘటన 16600 ప్రాంతంలో ఎదురు కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16,563. ఇక్కడి నుంచి 40 పాయింట్లు అటు,ఇటు ఛాన్స్ ఉంది. ఇవాళ్టికి నిఫ్టికి కీలక స్థాయి 15,545. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టి 15,500 ప్రాంతంలో మద్దతు అందుతుందేమో చూడండి. లేకుంటే 15,480 దాకా పడొచ్చు. ఇక పెరిగితే తొలి ప్రతిగటన 15,610 వద్ద ఎదురు కానుంది. 16,640పైన అమ్మొద్దు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 16620 స్టాప్లాస్తో అమ్మొచ్చు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 16500 ప్రాంతానికి వస్తే వెయిట్ చేయండి. ఇంకా పడితే 15450 స్టాప్లాస్తో కొనుగోలు చేయొచ్చు.