For Money

Business News

బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గేనా?

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాశారు. నాగ్‌పుర్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో లైఫ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గుతుందనే ఆశతో ఈ రంగానికి చెందిన షేర్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. వీటిపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. జీవిత బీమాపై ప్రీమియంపై పన్ను విధించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా కేంద్రం ఏమాత్రం కనికరించలేదు. అలాగే ఎంతో కీలకమైన మెడికల్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై కూడా 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా గడ్కరీ లేఖతో ప్రీమియం పూర్తిగా తొలగించకున్నా… తగ్గిస్తారనే టాక్‌ ఇపుడు మార్కెట్‌లో వినిపిస్తోంది. కొవిడ్‌ తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా జీఎస్టీ భారం కూడా మోయాల్సి రావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీటిపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని బీమా పరిశ్రమ వర్గాలు కూడా డిమాండు చేస్తున్నాయి. మొత్తానికి గడ్కరీ లేఖతో ఈ విషయంపై మార్కెట్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.