For Money

Business News

వన్‌ నేషన్‌.. వన్‌ గోల్డ్‌ రేట్‌

ప్రస్తుత బంగారం రేటు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. నగరానికి ఒక రేటు. షాపునకు ఒక రేటు ఉంటోంది. ఎక్కడ ఎందుకు రేటు తక్కువగా ఉందో…ఎందుకు ఎక్కువగా ఉందో తెలియడం లేదు. ఈ పద్ధతి వల్ల కొనుగోలుదారులు భారీగా మోసపోతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు ఉండాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇపుడు ఈ సమస్యకు పరిష్కారంగా వన్‌ నేషన్‌.. వన్‌ గోల్డ్‌ రేటు నినాదాన్ని ముందుకు తెచ్చింది జెమ్‌ అండ్‌ జువలరీ కౌన్సిల్‌ (జీజేసీ). దీనికి సంబంధించి వివిధ నగరాల్లోని బంగారం వర్తకులతో ఈ కౌన్సిల్‌ చర్చలు జరిపింది. దేశ వ్యాప్తంగా బంగారినికి ఒకే రేటు ఉండే విధంగా చొరవ చూపింది. ఈ కౌన్సిల్‌ ప్రయత్నం ఫలించినట్లు వార్తలు వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనం దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఒకే రేటు ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి షాపు యజమానులు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో ఓ అధికారిక ప్రకటన రావొచ్చని ఈటీ నౌ ఛానల్‌ పేర్కొంది.