హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసీ
ప్రస్తుతం ఆరోగ్య బీమా రంగంలో ఉన్న ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ సిద్దార్త్ మహంతీ అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పేర్కొంది. బీమా రంగంలోకి కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న సమయంలో ఎల్ఐసీ ఈ ప్రకటన చేయడం విశేషం. ఒకే కంపెనీ పలు రకాల బీమా పథకాలు అందించేలా కాంపోటిజ్ లైనెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొత్త ప్రభుత్వానికి తాము ప్రతిపాదనలు చేస్తామని, ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు ఎల్ఐసీ పేర్కొంది. హెల్త్ రంగంలోకి ప్రవేశించాలని తాము భావిస్తున్నామని… అవసరమైతే ఈ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీని టేకోవర్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఎల్ఐసీ ఛైర్మన్ తెలిపారు.