For Money

Business News

16,400పైన ప్రారంభమైన నిఫ్టి

నిన్నటి మాదిరి ఇవాళ కూడా నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ప్రారంభమైంది. 16,385 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 16,430 పాయింట్ల స్థాయిని తాకింది. నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి 16410, రెండో ప్రతిఘటన స్థాయి 16430. 16440 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇంకాస్త ముందే అమ్మొచ్చు. నిఫ్టి 16,450 దాటితే అమ్మొద్దు. ఎందుకంటే ఈ స్థాయి తరవాత నిఫ్టికి 16480 వరకు ఒత్తిడి లేదు. సో…సింపుల్‌. 16440 స్టాప్‌లాస్‌తో డే ట్రేడర్స్‌ నిఫ్టిని అమ్మొచ్చు. తొలి టార్గెట్‌ 16,340. ఈ స్థాయి పైన కొనసాగే అవకాశముంది. మిడ్‌సెషన్‌లో యూరో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైతే నిఫ్టి 16320ని తాకే అవకాశముంది.
రియల్‌ ఎస్టేట్‌పై చైనా ఆంక్షలు భారత్‌కు అనుకూలంగా మారుతుందేమో చూడాలి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎం అండ్‌ ఎం 786.50 1.33
కోల్ ఇండియా 146.00 1.11
హెచ్‌డీఎఫ్‌సీ 2,697.10 1.06
ఐసీఐసీఐ బ్యాంక్‌ 708.40 1.01
ఎల్‌ అండ్‌ టీ 1,636.50 0.80

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐషర్‌ మోటార్స్‌ 2,533.45 -3.18
టాటా స్టీల్‌ 1,411.05 -1.69
టెక్‌ మహీంద్రా 1,371.80 -1.06
హీరోమోటోకార్ప్‌ 2,756.05 -0.97
JSW స్టీల్‌ 742.50 -0.85