అంతలా జీడీపీ ఎలా పెరిగింది?
డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ 8.4 శాతం పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం ఉంటుందని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇవాళ ఎన్ఎస్క్ష ప్రకటించిన డేటా ప్రకారం ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా పేర్కొంది. మార్కెట్ అంచనాలకు కాస్త అటు, ఇటూగా ఉండాల్సిన డీజీపీ గణాంకాల్లో భారీ తేడా ఉండటంపై మార్కెట్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24)కు జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది ఎన్ఎస్ఓ. అయితే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు మాత్రం కేవలం 6.5 శాతం మాత్రమే పెరిగిందని పేర్కొంది. దీంతో మార్కెట్లో తాజా గణాంకాలపై చర్చ జరుగుతోంది. ఎన్నికల ఏడాదిలో వచ్చిన ఈ గణాంకాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా జీవీఏకు పన్ను వసూళ్ళను కలిపి… వచ్చిన మొత్తం నుంచి సబ్సిడీలు తేసేసిన మొత్తాన్ని జీడీపీగా పరిగణిస్తారు. ఈసారి పన్ను వసూళ్ళలో ఏకంగా 15 శాతం వృద్ధి ఉందని ప్రభుత్వం చెప్పడంతో… జీడీపీ గణాంకాలు అధికంగా కన్పిస్తున్నాయా అన్న చర్చ కూడా ఆర్థిక వేత్తల్లో సాగుతోంది.