దెబ్బతీసిన ద్రవ్యోల్బణ రేటు
డిసెంబర్ నెలలో అమెరికా ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాలను మించింది. 0.3 శాతం పెరిగింది. దీంతో డాలర్ కాస్త బలపడగా… ఈక్విటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మూడు ప్రధాన సూచీలు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నష్టాలు మరింత పెరుగుతాయా? లేదా మార్కెట్ గ్రీన్‌లో ముగుస్తుందా అనేది చూడాలి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ఇవాళ భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 79 డాలర్లకు చేరువ అవుతోంది. బులియన్ మార్కెట్లో పెద్ద మార్పు లేదు. ఇక షేర్ల విషయానికి వస్తే టెస్లా షేర్ ఇవాళ నష్టాలతో ట్రేడవుతోంది. కంపెనీ ఉద్యోగుల జీతాలు పెంచడమే దీనికి కారణం. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. యాపిల్ కంపెనీని దాటేసింది.