నిఫ్టి: ఇరువైపులా జాక్‌పాట్
మొత్తానికి షేర్ మార్కెట్ ఇపుడు ఇన్వెస్టర్లకు బదులు.. డే ట్రేడర్స్ మార్కెట్‌గా మారింది. పెరిగితే అమ్మడం, పడినపుడు కొనడం… ఇదే మంచి బిజినెస్‌గా మారింది. గత రెండు నెలలు ఇదే జరిగింది. చివర్లో ఓ రెండు వందల పాయింట్లు పెరిగి.. అక్కడే మరో రెండు నెలలు కొనసాగడం. వాస్తవానికి మార్కెట్‌ను ఇపుడు ఆల్గో ట్రేడింగ్ నిర్దేశిస్తోంది. ఇవాళ కూడా 16350-16200 మధ్య కదలిన మార్కెట్ మిడ్ సెషన్లో మరికాస్త క్షీణించి రెండో మద్దతు స్థాయిని తాకింది. ముఖ్యంగా షేర్లలో భారీ అమ్మకాలు సాగుతున్నాయి. నిఫ్టితో పాటు మిడ్ క్యాప్ షేర్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. నిఫ్టికి ఇవాళ ఉదయం అనుకున్నట్లే 16,340 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదురైంది. మిడ్ సెషన్‌లోపే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16162ని తాకింది. అంటే 180 పాయింట్లు పడిందన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి కోలుకుని 16282 వద్ద ముగిసింది. అంటే మరో 120 పాయింట్లు పెరిగిందన్నమాట. డే ట్రేడర్స్‌కు ఇవాళ 300 పాయింట్ల అవకాశం లభించింది. పొజిషనల్ ట్రేడర్స్‌కు ఇవాళ లాభం దాదాపు జీరో. ఎందుకంటే నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 2 పాయింట్లు పెరిగి 16,282 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ ఏకంగా ఒకటిన్నర శాతం దాకా క్షీణించి గ్రీన్‌లో ముగిసింది. ఇన్నాళ్ళూ నిఫ్టికి అండగా ఉన్న బ్యాంక్ నిఫ్టి ఇవాళ 0.6 శాతం నష్టంతో ముగిసింది. కేవలం మెటల్స్ కారణంగా నిఫ్టి గ్రీన్‌లో ముగియగలిగింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా స్టీల్ 1,428.50 4.00
JSW స్టీల్ 747.30 3.48
ఐఓసీ 104.80 2.49
ఎన్టీపీసీ 117.10 2.40
హిందాల్కో 436.50 2.24
నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీ సిమెంట్ 26,550.00 -2.09
కొటక్ బ్యాంక్ 1,778.60 -1.86 సన్ ఫార్మా 779.25 -1.78
బజాజ్ ఆటో 3,736.00 -1.63
ఐసీఐసీఐ బ్యాంక్ 693.80 -1.01