రిలయన్స్ రీటైల్లో కతర్ ఫండ్ పెట్టుబడి
రిలయన్స్ రీటైల్ వ్యాల్యూయేషన్ మూడేళ్ళలో డబుల్ అయింది. 2020లో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్ రీటైల్ కంపెనీలు పెట్టుబడులు సేకరించింది. దాదాపు 47వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అపుడు సేకరించగా… కంపెనీ విలువ 4 లక్షల 21 వేల కోట్లుగా లెక్కగట్టారు. ఇవాళ కతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి రిలయన్స్ రీటైల్ వెంచర్లో ఒక శాతం వాటాను సుమారు 8 వేల 300 కోట్లకు అమ్మింది. అంటే కంపెనీ వ్యాల్యూయేషన్ 8 లక్షల 28వేల కోట్లకు చేరిందన్నమాట. తాజా వ్యాల్యూయేషన్తో రిలయన్స్ కంపెనీలో వ్యాల్యూయేషన్ అధిక భాగం రీటైల్ విభాగం నుంచే వచ్చింది. రీటైల్ షేర్ల సంఖ్య 18వేల 500లకు చేరడంతో రిలయన్స్ రీటైల్ విలువ బాగా పెరిగింది. రిలయన్స్ షేర్ ఇవాళ 2వేల 522 వద్ద ముగిసింది. మరి ఈ వార్తకు కంపెనీ షేర్ ఎలా రియక్ట్ అవుతుందో చూడాలి.