40 శాతం తగ్గిన వేదాంత లాభం
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వేదాంత కంపెనీ రూ.2,640 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 4,421 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ లెక్కన కంపెని నికర లాభం 40 శాతం క్షీణించిందన్నమాట. అయితే మార్కెట్ అంచనాలతో పోలిస్తే మెరుగైన నికర లాభం ప్రకటించింది. మార్కెట్ విశ్లేషకులు కంపెనీ రూ. 1200 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఇదే కంపెనీ నికర లాభం మాత్రం 13 శాతం తగ్గి రూ. 38,251 కోట్ల నుంచి రూ. 33,342 కోట్లకు చేరింది. కమాడిటీస్ ధరలు బాగా తగ్గడమే టర్నోవర్ తగ్గడానికి కారణం.