అదానీ షేర్లలో రూ. 15400 కోట్ల బ్లాక్ డీల్
అమెరికాకు చెందిన పీఈ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ అనే సంస్థ అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలలో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను ఇవాళ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్లకు చెందిన షేర్లను అమెరికా కంపెనీ కొనుగోలు చేసింది. గల్ఫ్‌కు చెందిన ఓ కంపెనీ 300 కోట్ల డాలర్లను అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెడుతోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. అయితే అమెరికాకు చెందిన పీఈ సంస్థ ఈ పెట్టుబడులు పెట్టడంతో… అదానీ గ్రూప్‌నకు చెందిన అయిదు కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్లో ముగిశాయి.