17850 దిగువకు నిఫ్టి
మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కొనసాగింది. నిఫ్టి 17850 దిగువన క్లోజైంది. ఓపెనింగ్‌లో 18004ని దాటిన నిఫ్టి ఆ తరవాత 17818 స్థాయిని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 99 పాయింట్ల నష్టంతో 17844 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టి మార్కెట్ మూడ్‌ను దెబ్బతీసింది. అదానీ గ్రూప్ షేర్లలో షరా మామూలే. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ఇవాళ కూడా ఆరు శాతంపైగా నష్టంతో రూ. 1613 వద్ద ముగిసింది. సిప్లా కూడా 6శాతం ముగిసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక విడుదల తరవాత అదానీ ట్రాన్స్మిషన్స్, అదానీ టోటల్, అదానీ గ్రీన్ షేర్లలో మొదలైన అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ఇటీవల కాస్త కోలుకున్నట్లు కన్పించినా ఫోర్బ్స్ పత్రిక కథనం తరవాత ఇవాళ మళ్ళీ ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఆటో షేర్లలో ఒత్తిడి రావడంతో ఆరంభం లాభాలన్నీ కరిగిపోయాయి.