పాల ధరను మళ్ళీ పెంచిన అమూల్
గుజరాత్ కో ఆపరేటివ్ డెయిరీ సంస్థ అమూల్ కంపెనీ పాలధరను పెంచింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అమూల్ పేర్కొంది. లీటరు పాల ధరను రూ. 3 చొప్పున పెంచినట్లు అమూల్ తెలిపింది. తాజా ధరల ప్రకారం అమూల్ గోల్డ్ ధర రూ. 66లకు చేరింది. అమూల్ తాజా ధర రూ. 54కు, అమూల్ కౌ మిల్క్ దర రూ. 56లకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అమూల్ ఏ2 బఫెలో మిల్క్ ధర రూ. 70లకు చేరింది. గత అక్టోబర్ నెలలోనే అమూల్ కంపెనీ పాల ధరను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. ఉత్పత్తి వ్యయం,పాల సేకరణ ధర పెరిగినందున పాల ధర పెంచినట్లు అమూల్ పేర్కంది. గత ఏడాదితో పోలిస్తే దాణా ధర 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. గత డిసెంబర్లో మదర్ డెయిరీ కూడా పాల ధరను పెంచిన విషయం తెలిసిందే. అమూల్ ఇవాళ పాల ధరను పెంచడంతో ఇతర కంపెనీలు కూడా పెంచే అవకాశముంది.