… పడితే కొనండి
నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ పడితే కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు ప్రధాన మార్కెట్లన్నీ పనిచేయడం లేదు. కాబట్టి చాలా వరకు ఇవాళ్టి ట్రేడింగ్ టెక్నికల్స్ ఆధారంగా ఉండొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18015. సింగపూర్ నిఫ్టి 40 నుంచి 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టిని కొనడమే బెటర్ అని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి 18000-18050 మంచి బై జోన్‌గా అనలిస్టులు చెబుతున్నారు. 17,967ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని నిఫ్టిని కొనుగోలు చేయడం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ సలహా ఇస్తున్నారు. నిఫ్టి పెరిగితే 18225-18250 మధ్య లాభాలు స్వీకరించమని ఆయన సలహా ఇస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టి విషయానికొస్తే… ఇక్కడ కూడా పడితే కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టి బ్యాంక్ పడేందుకు పెద్ద కారణాలు లేవని ఆయన అన్నారు. నిఫ్టి బ్యాంక్ క్రితం ముగింపు 42,986. నిఫ్టి బ్యాంక్ కూడా నష్టాలతో ప్రారంభం కావొచ్చని… 42,833 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని అనూజ్ సూచించారు. స్టాప్‌లాస్‌ను టచ్ అయితే.. వెంటనే నష్టంతో బయటకు వచ్చి వెయిట్ చేయాలని అన్నారు. నిఫ్టి బ్యాంక్ తదుపరి మద్దతు స్థాయి 42,600గా పేర్కొన్నారు. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టిలలో స్టాప్‌లాస్‌ను కచ్చితంగా పాటించాలని. ఒకవేళ దిగువకు వెళితే వెంటనే నష్టాలు బుక్ చేయాలని… ఆ తరవాత మళ్ళీ అదే స్టాప్‌లాస్‌తో కొనాలని అనూజ్ సలహా ఇస్తున్నారు..