మొరాయిస్తున్న ట్విటర్
ట్విటర్ లాగిన్ అవడం కావడం లేదని అనేక మంది ఫిర్యాదు చేస్తున్నట్లు ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ పేర్కొంది. అమెరికా నుంచి కనీసం10,000 మంది ఫిర్యాదు చేసినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. అయితే గంటలో వీరి సంఖ్య తగ్గుతోందని పేర్కొంది. చాలా మంది ట్విటర్ నోటిఫికేషన్స్ కూడా పనిచేయడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక దేశాల్లో ట్విటర్ మొబైల్ యాప్ మొరాయిస్తోందని నెట్ బ్లాక్స్ పేర్కొంది. తమ అకౌంట్లలో వీడియో కూడా ప్లే అవడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు ట్విటర్ పనిచేయడం లేదని ట్వీట్ చేస్తే… సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రం వెంటనే స్పందించారు. తన ట్విటర్ అకౌంట్ పనిచేస్తోందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే అనేక మంది ట్విటర్లోనే ఫోటో స్నాప్షాట్లతో ఫిర్యాదు చేస్తున్నారు.