చివర్లో కోలుకున్నా..
ఒకవైపు కరోనా భయాల మధ్య వచ్చిన వీక్లీ సెటిల్మెంట్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. ఆరంభంలో వంద పాయింట్లు లాభపడినా.. ఉదయం గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి ఏకంగా 250 పాయింట్లు క్షీణించింది. అధిక స్థాయిలో షార్ట్ చేసిన ఇన్వెస్టర్లుకు ఇవాళ కాసుల పంటే. ఉదయం 18318ని తాకిన నిఫ్టి… మిడ్‌సెషన్‌లో 18068ని తాకింది. యూరో మార్కెట్లు స్థిరంగా ప్రారంభం కావడం… పెద్దగా నష్టాలు లేకపోవడంతో నిఫ్టి కోలుకుంది. మళ్ళీ వీక్లీ సెటిల్మెంట్ కారణంగా చివర్లో ఒత్తిడి వచ్చింది. దీంతో నిఫ్టి మళ్ళీ స్వల్పంగా క్షీణించి 18127 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 72 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో క్లోజ్ కాగా, నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు అధిక నష్టాలతో ముగిశాయి. ఫార్మా రంగానికి కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 84 డాలర్లకు చేరడం కూడా మార్కెట్‌పై మళ్ళీ ఒత్తిడి పెంచింది. అదానీ షేర్లలో కొంత ఒత్తిడి కన్పిస్తోంది. సూచీలు స్వల్పంగా నష్టపోయినా.. షేర్లు మాత్రం భారీ నష్టాలతో ముగుస్తున్నాయి. వెయిటేజీ అధికంగా ఉన్న షేర్లకు మద్దతు అందడంతో నిఫ్టి స్వల్పంగా నష్టపోయినట్లు కన్పిస్తోంది. వాస్తవానికి నిఫ్టిలో కూడా పలు షేర్లు 3 శాతం నుంచి 4 శాతం దాకా క్షీణించాయి.