నేను ఉద్యోగిని.. మీ సర్వెంట్‌ను కాదు…
ఇండిగో ఎయిర్వేస్కు చెందిన విమానంలో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యాహ్నం నుంచి ఈ వీడియో మధ్యాహ్నం నుంచి హల్చల్ చేస్తోంది. ఇండిగో సిబ్బందికి, ఓ ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వివాదాన్ని ఓ ప్యాసింజర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో రికార్డ్ చేసింది ఈ నెల 16న. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తోన్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. ఎయిర్‌హోస్టెస్‌పై ఆగ్రహం శృతి మించడంతో ఆమె కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. చివర్లో ఎయిర్ హోస్టెస్‌ను .. యూ ఆర్ ఎ సర్వెంట్ అని ప్రయాణికుడు అని అనగానే.. ఆమె చాలా గట్టిగా బదులు ఇచ్చింది. ‘‘నేను మీ సర్వెంట్‌ను కాదు. ఉద్యోగిని” అంటూ ఘాటుగా బదులు ఇచ్చింది. ఆరంభంలో… అందరూ ఈ వీడియోను చూస్తున్నారు కాని.. పెద్దగా పట్టించుకోలేదు. కాని క్రమంగా ఎయిర్ హోస్టెస్‌కు మద్దతుగా జనం ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. కాని అసలు కిక్ ప్రారంభమైంది. మరో ఎయిర్ వేస్ కంపెనీ ఉన్నతాధికారి స్పందించడంతో. ఈ వీడియోపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ట్విటర్లో స్పందించారు. విమాన సిబ్బందిగా మద్దతుగా నిలబడ్డారు. సంజీవ్ కపూర్ గతంలో ఇండియన్ హోటల్స్ కూడా పనిచేశాయి. ఆయన హాస్పిటాలిటీ రంగం గురించి బాగా తెలుసు. విమానసిబ్బంది కూడా మనుషులేనని. ఎయిర్ హోస్టెస్‌ను ఎంతో ఆవేదనకు గురిచేస్తే తప్ప ఇలా వ్యవహరించరని అన్నారు. విమాన సిబ్బంది పట్ల ప్రయాణీకులు చాలా దురుసుగా ప్రవర్తించడం, ఒక్కోసారి వారిపై దాడి చేయడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని అన్నారు. ప్రధానంగా ఎయిర్ హోస్టెస్‌ను సర్వెంట్ అని పిలవడం దారుణమని ఆయన అన్నారు. ఇండిగో విమానంలో జరిగిన ఘటనపై జెట్ ఎయిర్ వేస్ సీఈఓ స్పందించడంతో ఇపుడు అదొక వైరల్ వార్తగా మారింది. దేశంలో ప్రధాన పత్రికలన్నీ ఈ ఘటనను కవర్ చేస్తూ… ఎయిర్ హోస్టెస్‌కు మద్దతుగా నిలిచాయి.
As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl
— Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022