వడ్డీరేట్ల పెంపు.. పెరగనున్న ఈఎంఐలు
రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 0.35 శాతం పెంచినట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దీంతో కనీస వడ్డీరేటు 8.65 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీరేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ 2.25 శాతం వడ్డీరేట్లు పెంచింది. క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే 8.65 శాతం వడ్డీరేటు వసూలు చేస్తుండగా, తక్కువ రేటింగ్ ఉన్నవారికి అధిక వడ్డీ వసూలు చేస్తారు. గృహ రుణాల్లో ఇదే తక్కువ వడ్డీరేటు కావడం విశేషం. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. ఎంసీఎల్ఆర్ను 0.30 శాతం పెంచింది. మే నెల నుంచి బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లను పెంచడంతో ఈఎంఐలు భారీగా పెరిగాయి.