LEVELS: పెరిగితే అమ్మండి
చాలా రోజుల తరవాత మార్కెట్లో నిఫ్టి షార్ట్ చేయమనే సలహాలు వస్తున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 18,608. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభం చూపుతోంది. ఒకవేళ అదృష్టం కొద్దీ నిఫ్టి గనుక ఓపెనింగ్‌లో 18700 స్థాయిని దాటితే కళ్ళు మూసుకుని లాభాలు స్వీకరించమని అనలిస్టులు అంటున్నారు. పొజిషన్స్ లేనివారు స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అంటే 50 పాయింట్ల స్టాప్‌లాస్‌తో 18700పైన నిఫ్టి షార్ట్ చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ సూచిస్తున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు రెండున్నర శాతం పెరిగిన వెంటనే లాభాల స్వీకరణ జరిగిందని… మార్కెట్ ఈ స్థాయి నుంచి పెరగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రికి వచ్చే ఫెడ్ నిర్ణయం ఎలా ఉంటుందో… మార్కెట్ ఎలా స్పందిస్తుందో తెలియని పరిస్థితుల్లో ట్రేడర్లు ఇవాళ తమ పొజిషన్స్‌ను క్లోజ్ చేయడం మంచిదని ఆయన అన్నారు. అంటే షార్ట్ చేసినవారు ఇవాళే లాభాలు స్వీకరించమని చెప్పారు. రిస్క్ వొద్దనుకునే ఇన్వెస్టర్లు 18670 ప్రాంతంలోనే లాభాలు స్వీకరించాలని సూచించారు. షార్ట్ చేసే వారు మాత్రం సాధ్యమైనంత వరకు 18700 ప్రాంతంలో చేయాలని అన్నారు. ఆ పరిస్థితి వస్తుందేమో చూడాలి.