ఈసారి ఇన్కమ్ ట్యాక్స్‌లో కీలక మార్పులు?
నార్త్ బ్లాక్‌లో 2023-24 బడ్జెట్ కసరత్తు జోరుగా సాగుతోంది. ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. ఎందుకంటే ఇది మోడీకి ఎన్నికల బడ్జెట్. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. 2024 మేలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున..ఆ ఏడాది మోడీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇపుడు ఇన్కమ్ ట్యాక్స్‌ను రెండు పద్ధతులు ఉన్నాయి. పాత పద్ధతిని కొనసాగిస్తూనే కొత్త పద్ధతిని మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం ఎలాంటి మినహాయింపులు, రాయితీలు లేకుండా ఫ్లాట్‌గా పన్ను విధిస్తోంది. అయితే కొత్త పద్ధతి పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ పద్ధతికి మారిన వారి సంఖ్య మొత్తం ఐటీ చెల్లింపుదారుల్లో పది శాతం కూడా లేరు. దీంతో కొత్త పద్దతిని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు మార్పులు తెస్తున్నారు. ఇపుడు ఉన్న పద్ధతి ప్రకారం రూ.2.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పద్ధతిలో కూడా పాత పద్ధతి మాదిరి రూ. 5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చే అంశాన్ని మోడీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే కొత్త పద్ధతికి ఓకే చెప్పినవారికి కూడా స్టాండర్డ్ డిడక్షన్, ఇంటి రుణాలపై చెల్లించే పన్నుకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తులు వస్తున్నాయి. అలాగే ఇపుడు 1 నుంచి 6 వరకు ఉన్న ఐటీఆర్ ఫామ్‌లను తగ్గించి… ఒకే ఐటీ కామన్ ఫామ్‌ను తీసుకురానున్నారు.