LEVELS: 18,700 దాటితే…
నిఫ్టి క్రితం ముగింపు 18609. సింగపూర్ నిఫ్టి 69 పాయింట్ల లాభం చూపుతోంది. మరి ఈ స్థాయి లాభంతో నిఫ్టి ప్రారంభమౌతుందా అనేది చూడాలి. అలాగే 18680పైన నిలబడుతుందేమో చూడాలి. ఇప్పటికే పొజిషన్స్ తీసుకున్నవారు 18700 లేదా 18750 మధ్య లాభాలు స్వీకరించవచ్చు. అయితే 16716పైన నిఫ్టి గంట సేపు నిలబడితే మరింత బలపడవచ్చు. అయితే ఇవాళ మార్కెట్‌ను డ్రైవ్ చేసే అంశాలు ఏవీ లేవు. బ్యాంకులు కూడా భారీగా పెరుగాయా అన్నది అనుమానమే. ఇక ఎఫ్ఎంసీజీ, రిలయన్స్, ఆటో షేర్లే నిఫ్టిని ముందుకు తీసుకెళ్ళాలి. లేకుంటే నిఫ్టి మళ్ళీ 18600 ప్రాంతానికి రావొచ్చు. వస్తే వెంటనే కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే నిఫ్టికి గట్టి మద్దతు 18550 ప్రాంతంలో ఉంది. 18600 ప్రాంతంలో రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం 18500 లేదా 18550 కోసం వెయిట్ చేయొచ్చు. 18750 దాటితే నిఫ్టి మళ్ళీ ఆల్‌టైమ్ హై దిశగా వెళ్ళొచ్చు. కాని ఆ ఉత్సాహం మార్కెట్లో లేదు.