LEVELS: పడితే కొనండి
నిఫ్టి నిన్న18812 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి మాదిరి నిఫ్టి గనుక పడితే కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ మేనేజింగ్ ఎడటిర్ అనూజ్ సింఘాల్ సూచించారు. అంటే 18750 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని అన్నారు. అయితే డే ట్రేడర్స్ 18720 లేదా 18730 స్టాప్ లాస్‌తో ట్రేడ్ చేయమని ఆయన సలహా ఇచ్చారు. అదే పొజిషనల్ ట్రేడరయితే స్టాప్ లాస్ 18620 వద్ద ఉంచుకుని ట్రేడ్ చేయాలని సూచించారు. నిఫ్టి బ్యాంక్ కన్నా… నిఫ్టిలో కదలికలు చురుగ్గా ఉంటాయని చెప్పారు. అయితే నిఫ్టి ఐటీ ఇవాళ కూడా రాణించవచ్చని… ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లకు పరిమితమైతే మంచిదని అనూజ్ చెప్పారు. సూచీ కంటే షేర్లలోనే మంచి ప్రతిఫలాలు అందుతాయని అన్నారు.